Pawan kalyan: అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు
Pawan kalyan: సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan kalyan Tirupati Speech: సనాతన ధర్మాన్ని కొందరు వైరస్‌తో పోల్చారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. కొందరేమో రామాయణాన్ని విష వృక్షమన్నారని, మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండలవారికి పెడతారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రారంభోత్సవంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ విమర్శలు చేశారని పవన్ గుర్తుచేసుకున్నారు. ఎవరు, ఎవరిని అసహ్యించుకున్నా సరే శ్రీరామచంద్రుడి గురించి తప్పుగా మాట్లాడే ధైర్యం చేయొద్దని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనల్ని రక్షిస్తుంది. తిరుపతిలో తప్పు జరుగుతోంది అని గతంలోనే హెచ్చరించాం. సరిదిద్దుకోండి అని చెప్పాం. అయినప్పటికీ పాత ప్రభుత్వం మా మాటల్ని పట్టించుకోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు అని పాత ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.