Purandeswari: మద్యం అమ్మకాల్లో పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోంది
Purandeswari: ఏపీలో ప్రజావ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది
Purandeswari: విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందన్నారు. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి నెలకొందని విమర్శించారు.