సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో వివిధ పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య పోరు ఉంటుంది. ఒకే పార్టీలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు ఉంటాయి. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి. అక్కడ జరుగుతున్న వార్ మూడు పార్టీల మధ్య కాదు ఒకే పార్టీలో అదీ అధికార పార్టీలోనే. మరి ఒకే ఒరలో మూడు కత్తులు ఇముడుతాయా?
అధికార పార్టీలో ఇదో రకం అలజడి
ఒకప్పుటి శత్రువులు ఇప్పుడు మిత్రులవుతారా?
ఒకే ఒరలో మూడు కత్తులు ఇముడుతాయా?
ఈ మూడు ముక్కలాటలో ఎవరిది పైచేయి?
ఇదీ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం. ఇక్కడే మూడు ముక్కలాట మొదలైంది. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌సీపురం నియోజవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి పక్క నియోజకవర్గానికి వెళ్లిన ప్రస్తుత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కూడా మంచి పట్టే ఉంది. నాలుగుసార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలతిచిన తోట త్రిమూర్తులుకు గట్టే పట్టే ఉంది. తాజాగా తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేశారు. వైసీపీ గూటికి చేరారు. ఒకప్పుడు వీరంతా ప్రత్యర్థి పార్టీల్లో ఉండగా ఇప్పుడు ఒకే పార్టీలో ఒకే గొడగు కిందికి వచ్చేశారు. క్యాడర్‌లో, కార్యకర్తల్లో ఇప్పుడిదే చర్చనీయాంశమైంది.
గత రెండు దశాబ్దాలుగా ఈ ముగ్గురు లో ఏ ఇద్దరికీ సరిపడలేదనే చెప్పాలి. పిల్లి, తోటల మధ్య అగ్గి అక్కర్లేకుండానే నిన్నామొన్నటి వరకు భగ్గుమనేది. ఐదునెలల క్రితం వరకు గురుశిష్యులుగా ఉన్న సుభాష్‌చంద్రబోస్, వేణుగోపాలకృష్ణ ఎన్నికల సమయంలోనూ ఇమడలేకపోయారు. బోసు నియోజవర్గంలో వేణు పాదం మోపడం ఆ వర్గానికి అస్సలు నచ్చలేదు. అందుకే వేణు ఓడిపోవాలని చూశారు కానీ జగన్ వేవ్ ముందు అవేమీ పని చేయలేదు. తర్వాత మారిన పరిస్థితుల మధ్య బోసు తోటల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎదురు తారసపడితే రుసరుసలాడుకునే ఆ ఇద్దరు నేతలు కలిసే పరిస్థితి ఏర్పడింది. ఇది నమ్మశక్యం కావట్లేదని క్యాడరే చెబుతోంది.