అయ్యన్నపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు.. కమీషనర్ పిర్యాదు మేరకు చర్యలు
ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.
ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. తన పట్ల అనుచింతంగా ప్రవర్తించారంటూ నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ కృష్ణవేణి ఇచ్చిన పిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయింది. అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని మున్సిపల్ కమిషనర్ టీ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్న పాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసుతో పాటు దిశ చట్టం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయ్యన్నను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు తెలిపారు. చడం ఇదే తొలిసారి.