Perni Nani: చంద్రబాబుతో జరిగింది ములాఖత్ కాదు.. మిలాఖత్
Perni Nani: సెంటిమెంట్ కోసం కాదు.. సెటిల్‌మెంట్ కోసం వెళ్లాడు
Perni Nani: టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీమంత్రి పేర్నినాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ చంద్రబాబు వద్దకు పరామర్శకు వెళ్ళారా లేక డీల్ మాట్లాడుకోవడానికి వెళ్ళారా? అని పేర్నినాని ప్రశ్నించారు. ఈరోజు జరిగింది ములాఖాత్ కాదు..మిలాఖత్..అని వ్యాఖ్యనించారు. టీడీపీతో జనసేన పొత్తు పర్మినెంట్ అని పవన్ క్లారిటీగా ఉన్నారని.. బీజేపీ ఏమో పిల్లి మొగ్గలు వేస్తోందని పేర్నినాని అన్నారు.