Perni Nani: ఏలూరు జిల్లా కలెక్టర్‌పై పేర్ని నాని ఆగ్రహం
Perni Nani: ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి హాజరుకాని ఏలూరు కలెక్టర్
Perni Nani: ఏలూరు జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులపై ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు కాలేదు. దీంతో పేర్ని నాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి కలెక్టర్, ఇతర అధికారులు సమావేశానికి రాకుంటే సీఎం జగన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొంటూ కలెక్టర్‌కు లేఖ రాయాలని జడ్పీ ఛైర్ పర్సన్‌కు పేర్నినాని సూచించారు.
జిల్లా పరిషత్ మీటింగ్‌లకు హాజరయ్యే ఉద్దేశం ఏలూరు కలెక్టర్‌కు లేదా..? అని పేర్నినాని ప్రశ్నించారు. వ్యవస్థలను లెక్కచేయకపోవడం సరికాదని... నియంతలా వ్యవహరించవద్దని సూచించారు. బరితెగింపుతనం ఏ స్థాయి అధికారికి కూడా మంచిది కాదన్నారు.