Anna Lezhneva: తిరుమల శ్రీవారిని దర్శించుకన్న పవన్ సతీమణి

Update: 2025-04-14 01:18 GMT
Anna Lezhneva: తిరుమల శ్రీవారిని దర్శించుకన్న పవన్ సతీమణి
  • whatsapp icon

Anna Lezhneva: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శిచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురై స్వల్ప గాయంతో బయటపడటంతో అన్నా లెనినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రం ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో బస చేసి..క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీభూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథిగ్రుహంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. 

Tags:    

Similar News