Pawan Kalyan: డోంట్ ఫియర్.. ఐ యామ్ హియర్..
Pawan Kalyan: ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Pawan Kalyan: ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. ఈ వర్చువల్ మీట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారంపై డిప్యూటీ సీఎం చర్చించనున్నారు. ఇటీవల కడప జిల్లా గాలివీడు ఎంపీడీవోపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అధికారులు, ఉద్యోగులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు పవన్.
ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎంతో నిర్మాత దిల్‌రాజు భేటీ
కాగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సినీ నిర్మాత దిల్‌రాజు భేటీ కానున్నారు. పవన్‌ను కలిసి ప్రత్యేకంగా చర్చించనున్నారు దిల్‌రాజు. రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించనున్నారు. పవన్ డేట్‌లు ఆధారంగా ఏపీలోనే ఈవెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చరిత్ర క్రియేట్ అయ్యేలా గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఉంటుందన్న దిల్‌రాజు.. ఈ సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారన్నారు.