Janasena: ఖాకీ వర్సెస్ జనసేన.. రేపు తిరుపతి వెళ్లనున్న పవన్ కల్యాణ్..
Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు తిరుపతి వెళ్లనున్నారు.
Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు తిరుపతి వెళ్లనున్నారు. శ్రీకాళహస్తి సీఐ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. 4 రోజుల క్రితం జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పవన్. సీఐ వ్యవహారాన్ని శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటానని హెచ్చరించారు. తమ కార్యకర్తను ఎందుకు కొట్టారని సీఐను నిలదీస్తామని పవన్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనుండటంతో.. ఎస్పీ ఆఫీస్‌కు బైక్ ర్యాలీగా వెళ్లేందుకు జనసేన ప్లాన్ చేస్తోంది. అయితే అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టకూడదని పోలీసులు సూచిస్తున్నారు.