Pawan Kalyan: మచిలీపట్నంలో పవన్ కల్యాణ్ మౌన దీక్ష
Pawan Kalyan: రాజకీయాల్లో బురద పడుతుందని తెలిసినా ముందుకే సాగుతాం
Pawan Kalyan: 2024లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత బందరులో గాంధీ జయంతి చేసుకుందామన్నారు జనసేన అధినేత పవన్. గాంధీజయంతి సందర్భంగా.. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం.. మరోసారి పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో అభిప్రాయబేధాలు సహజమన్న పవన్.. సీఎం జగన్‌పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. రాజకీయాల్లో బురద పడుతుందని తెలిసినా ముందుకే సాగుతామని చెప్పారు. బురదలో నుంచి కమలం వికసించినట్లు.. కలుషితమైన రాజకీయాల్లోంచి జనసేన కమలం వికసిస్తుందని అన్నారు జనసేనాని.