CM Jagan: ఈ నెల 9న వైఎస్‌ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

CM Jagan: 2024 ఎన్నికలకు కేడర్‌ను ప్రిపేర్ చేసేందుకు వైసీపీ సమావేశం

Update: 2023-10-06 08:06 GMT

CM Jagan: ఈ నెల 9న వైఎస్‌ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

CM Jagan: ఇన్నాళ్లు అడ్మినిస్ట్రేషన్‌పై ఫోకస్‌ పెట్టిన ఏపీ సీఎం జగన్ ఇప్పుడు పార్టీపై దృష్టి సారించారు. 2024 ఎన్నికలకు పార్టీని యాక్టీవ్ చేసే కార్యాచరణను ప్రారంభించారు. ఇన్ని రోజులు పాలన వ్యవహారాలను చక్కబెట్టేందుకు పూర్తి సమయాన్ని వెచ్చించారు సీఎం. సంక్షేమంలో ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు అందేలా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలన సాగించారు. అయితే ఇప్పుడు పాలనతో పాటు పార్టీపై కూడా సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.

ఇందులో భాగంగానే ఈ నెల 9న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. పార్టీ నేతలతో కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గం, మండల స్ధాయి నేతలు హాజరవ్వబోతున్నారు. ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న వై ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ కార్యక్రమం గురించి ఆరోజు హాజరయ్యే నేతలకు జగన్ వివరించబోతున్నారు.

అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ‌్యంలో పాలనా వ్యవహారాలను తగ్గించుకుని పార్టీపై దృష్టి పెట్టారు సీఎం జగన్. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తారనే చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికలకు సంబంధించిన పార్టీ క్యాడర్‌కు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. మరో వైపు చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న అధికార పార్టీ సమావేశం నిర్వహిస్తుండడంతో ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News