Navy Milan-2024: విశాఖ బీచ్ రోడ్‌లో నేడు నేవీ మిలాన్-2024
Navy Milan-2024: యుద్ధ విమానాల విన్యాసాల్లో పాల్గొననున్న 50 దేశాలు
Navy Milan-2024: విశాఖ బీచ్ రోడ్‌లో నేడు నేవీ మిలాన్-2024 నిర్వహిస్తున్నారు. 50 దేశాలు యుద్ధ విమానాల విన్యాసాల్లో పాల్గొననున్నాయి. మిలాన్ కోసం వచ్చిన యుద్ధ నౌకల్లో మేరీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఉంది. ఇండియన్ నేవీ నుంచి 20 యుద్ధ నౌకలు, యుద్ధ విమాన వాహక నౌకలు , విక్రాంత్ INS, విక్రమాదిత్య, పీ8ఐ నిఘా విమానం , మిగ్ 29MIG29 యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. మిలాన్ వేడుకలకు వేలాది మంది సందర్శకులు తరలి రానున్నారు. నేవీ మిలాన్‌కు 5 వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
బీచ్ రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌కి లక్ష మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని నేవీ అధికారులు అంచనా వేశారు. 30 ఎన్‌క్లోజర్లు, 30 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాట్లు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నా రు. వీవీఐపీ, వీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోస్తు తదితరాలను పోలీసు విభాగం ఆధ్వర్యంలో చేపట్టారు. బీచ్ ప్రాంతంలో బ ార్‌కేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.