Chebrolu: సంగం డెయిరిలో జాతీయ భద్రత దినోత్సవం
కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలని సంగం డెయిరి ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.
చేబ్రోలు: కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలని సంగం డెయిరి ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గుంటూరు బి.రాంబాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ తెనాలి ఆదేశాల మేరకు 49వ జాతీయ భద్రత దినోత్సవం సందర్భంగా సంగం డెయిరిలో పరిశ్రమ ఆవరణలో మార్చి 4వతేదీనుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్న భద్రత వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు జాతీయ భద్రత పతాక ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా ధూళిపాళ్ళ మాట్లాడుతూ అనుకోని సందర్భాలలో ప్రమాదం సంభవిస్తే కార్మికులతో పాటు వారి కుటుంబాలు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందన్నారు. కనుక ప్రతి ఒక్కరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా, భద్ర తగా వుండాలని సూచించారు. డెయిరిలో పనిచేయు కార్మికుల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వవలసినదిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్, ఇతర అధికారులు, డెయిరి కార్మికులు పాల్గొన్నారు.