Vijayasai Reddy: సినీరంగమేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
Vijayasai Reddy: పేదలు, కార్మికుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
Vijayasai Reddy: సినీనటుల రెమ్యూనురేషన్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో మాట్లాడినప్పటి నుండి మొదలైన వివాదం ఇప్పటి వరకూ సమసిపోలేదు. నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దానిపై చిరంజీవి అభిమానులు కూడా సలహాలు ఇస్తే ఎదురుదాడి చేస్తారా అంటూ ర్యాలీలు నిర్వహించారు. తాజాగా సినీరంగంపై ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదన్నారు. ఫిలింస్టార్స్ అయినా పొలిటీషియన్స్ అయినా...ప్రజలు ఆదరిస్తేనే మనుగడన్నారు. పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిదేనని...వారి యోగక్షేమాల బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.