YS Avinash Reddy: సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి లేఖ.. విచారణకు హాజరుకాలేనన్న అవినాష్ రెడ్డి
YS Avinash Reddy: విచారణకు హాజరయ్యేందుకు 10రోజుల సమయం కావాలన్న అవినాష్
YS Avinash Reddy: సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. రేపు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యం దృశ్యా హాజరుకాలేని అవినాష్ రెడ్డి లేఖలో తెలిపారు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనినాష్ తల్లికి చికిత్స కొనసాగుతోంది. తల్లి అనారోగ్యంతో ఉన్నందున విచారణకు 10రోజలు సమయాన్ని కోరారు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి లేఖతో సీబీఐ ఎలా స్పందింస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.