Aadabidda Nidhi Scheme: మహిళలకు గుడ్ న్యూస్..ఈ పత్రాలు సిద్దంగా ఉంటే..ప్రతినెలా రూ. 1500 మీ సొంతం

Aadabidda Nidhi Scheme: ఏపీలో పింఛన్ల పెంపునకు స్వీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు మరో కీలక హామీ అమలుకు రెడీ అయ్యారు. పూర్తి వివరాలు చూద్దాం.

Update: 2024-07-09 03:53 GMT

Aadabidda Nidhi Scheme: మహిళలకు గుడ్ న్యూస్..ఈ పత్రాలు సిద్దంగా ఉంటే..ప్రతినెలా రూ. 1500 మీ సొంతం

Aadabidda Nidhi Scheme:ఏపీలో భారీ విజయం సాధించిన కూటమి సర్కార్..అదే తరహాలో ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెబుతోంది. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. సామాన్యుడికి మేలు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే ఏపీలో పింఛన్లకు స్వీకారం చుట్టిన చంద్రబాబు..మరో హామీ అమలుకు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్న త్వరలోనే కార్యాచరణలోకి తీసుకువచ్చే విధంగా సీఎం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతీ పథకాన్ని అమలు చేసే యోచనలో ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే 18ఏళ్లు నిండిన ప్రతీ మహిళల ఖాతాలో ఫ్రీగా నెలకు రూ. 1500చొప్పున జమ చేసే విధంగా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది.

అయితే ఈ పథకం దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాల వివరాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నడుస్తోంది. ఆ వివరాల ప్రకారం..ప్రతి మహిళలకు 18ఏండ్లు వయస్సు దాటి ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి. అదేవిధంగా పుట్టిన తేదీ ధ్రువపత్రము, మహిళ పేరుతో బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈ వివరాలతో కూడిన సమాచారం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వచ్చే నెలలో ఈ స్కీం ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. అటు నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సిద్ధం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నెలరోజుల లూపే ఇసుక పాలసీని తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన ఇసుక విధానం తీసుకువస్తున్నారు.

Tags:    

Similar News