తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి.. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపు
* రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం
MLC Elections: ఉత్కంఠ భరితమైన పోరు నడుమ సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. వైసీపీ మద్దతుతో పర్వతరెడ్డి బరిలో దిగారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యత సాధించినా... అవసరమైన మెజారిటీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. ఈ మేరకు పర్వతరెడ్డికి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందజేశారు.