Roja: కాణిపాకంలో రోజా పర్యటన.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Roja: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ధర్మ ప్రచార మాసోత్సవాలు ప్రారంభం

Update: 2023-09-16 09:45 GMT

Roja: కాణిపాకంలో రోజా పర్యటన.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Roja: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి మంత్రి రోజా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మాసోత్సవాలు జరగనున్నాయి. దేవస్థానం ప్రచార రథం చిత్తూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో తిరగనుంది. ఈ సందర్భంగా స్వామి వారికి రోజా పట్టు వస్త్రాలు సమర్పించారు. సిద్ధి, బుద్ధి, సమేత శ్రీ స్వామివారిని అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రచార రథంలో ఉంచి, ప్రచార రథానికి రోజా పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఆలయ మాడా వీధుల్లో మేళ తాళాలు ,మంగళ వాయిద్యాలు, కోలాటలు, పలు సాంస్కృతి కార్యక్రమాలు నడుము వైభవంగా ఊరేగించారు . స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి రోజా అన్నారు.

Tags:    

Similar News