Gudivada Amarnath: 10 ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలి..
Gudivada Amarnath: ఉత్తరాంధ్రలో వారాహి యాత్రకు వస్తున్న పవన్ కల్యాణ్‌కు మంత్రి అమర్‌నాథ్ సవాల్ విసిరారు.
Gudivada Amarnath: ఉత్తరాంధ్రలో వారాహి యాత్రకు వస్తున్న పవన్ కల్యాణ్‌కు మంత్రి అమర్‌నాథ్ సవాల్ విసిరారు. పది ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. ఇక్కడ ఏదో అన్యాయం అయిపోయిందని ... వాటిపై ఇక్కడ మాట్లాడాతారనే మాటలను ఖండిస్తున్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది అంటే విశాఖ అని చెప్పక తప్పదన్నారు.
పవన్‌కు పది పశ్నలు సంధించారు మంత్రి అమర్నాథ్..
1. విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించిన పవన్‌కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత ఉందా?
2. ఉత్తరాంధ్ర మీద పవన్‌కు సొంత ఎజెండా ఉందా?
3. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదు?
4. చంద్రబాబు పాలనలో 40 గుళ్ళు కులదొస్తే ఎందుకు నోరు మెదపలేదు?
5. కమీషన్ కోసం కక్కుర్తిపడి చంద్రబాబు పోలవరాన్ని నాశనం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు.
6. ప్రత్యక హోదాపై ఎందుకు మాట్లాడం లేదు?.
7. ఉద్దనం కిడ్నీ సమస్యను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అభినందించలేకపోతున్నావు?
8. వాలంటీర్ వ్యవస్థను కించపరిచిన పవన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.
9. పోలీసు కానిస్టేబుల్ కుమారుడిని అని చెప్పుకొనే పవన్ 40 మంది పోలీసులకు గాయలైతే ఎందుకు స్పందించలేదు?.
10. స్టీల్ ప్లాంట్‌పై కార్మికులకు ఒక క్లారిటీ ఇవ్వాలి.