AP News: ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలో యువకుడి మృతి

AP News: గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఎస్ఐ ఎంపిక సందర్బంగా అపశృతి చోటు చేసుకుంది.

Update: 2023-09-15 13:45 GMT

AP News: ఎస్సై దేహదారుఢ్య పరీక్షలో యువకుడి మృతి

AP News: గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఎస్ఐ ఎంపిక సందర్బంగా అపశృతి చోటు చేసుకుంది. పరుగు పందెం సందర్భంగా మోహన్ అనే యువకుడు సొమ్మసిల్లి కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మోహన్ ను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మోహన్ చనిపోయినట్టు తెలిపారు. మోహన్ చిన్న తనం నుంచి ఎస్ఐ అవ్వాలని కలలు కనేవాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రిటర్న్ టెస్ట్ పాస్ ఐయ్యాడని దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయాడు అని తెలిపారు.

Tags:    

Similar News