పవన్‌కల్యాణ్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు
Pawan Kalyan: పవన్ తన పర్యటనపై చేసిన వ్యాఖ్యలు.. ఎటువంటి సమాచారంతో చేశారని నోటీసులు
Pawan Kalyan: జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు ఇచ్చారు. పవన్ తన పర్యటనపై చేసిన వ్యాఖ్యలు... ఎటువంటి సమాచారంతో చేశారని... తాము ఇచ్చిన నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని.. రిప్లై లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాచ్చా అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు సరికాదన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే పర్యావసనాలు ఉంటాయని హెచ్చరించారు. తమ సమాచార వ్యవస్థ తమకు ఉందని.. రెచ్చగొట్టే భాషా, సైగలు మానుకోవాలని సూచించారు.