Kia Motors India: కియా మోటార్స్ ప్లాంట్ లో చోరీ..900 ఇంజిన్లు మాయం

Update: 2025-04-08 05:02 GMT
Kia Motors India: కియా మోటార్స్ ప్లాంట్ లో చోరీ..900 ఇంజిన్లు మాయం
  • whatsapp icon

Kia Motors India: అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో భారీ చోరీ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి సుమారు 900కార్ల ఇంజన్లు మాయం అయ్యాయి. కియాతోపాటు ఈ ప్రాంతంలో 25అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ప్రధాన పరిశ్రమలో రోజుకు 450కార్ల ఉత్పత్తి జరుగుతుంది. వీటికి అవసరమైన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుంచి వస్తుంటాయి. ఈ క్రమంలో దాదాపు 900 ఇంజిన్ల మాయం అయినట్లు యాజమాన్యం గుర్తించింది.

మార్చినెలలో ఎస్పీ రత్నకియా పరిశ్రమను సందర్శించారు. ఆ సమయంలోనే ఇంజిన్ల మాయం గురించి కియా సీఈవో, ఎండీ గ్వాంగులీ ఎస్పీ ద్రుష్టికి తీసువెళ్లనిట్లు సమాచారం. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విచారించాలని కోరినట్లు తెలుస్తోంది. కానీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మార్చి 19న కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. దీని వెనక గతంలో కియలో పనిచేసి వెళ్లిన ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కియ పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో మార్గ మధ్యలో చోరీ జరిగిందా లేదా మరెక్కడైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News