Tirumala laddu : మరింత రుచిగా తిరుమల శ్రీవారి లడ్డు..కారణం ఇదే

Tirumala laddu : తిరుమల శ్రీవారి లడ్డు మరింత రుచిగా మారనుంది. దీనికి ప్రధాన కారణమైన నెయ్యి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం

Update: 2024-08-31 01:18 GMT

Tirumala laddu : మరింత రుచిగా తిరుమల శ్రీవారి లడ్డు..కారణం ఇదే

Tirumala laddu : శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో నిత్య ఆరాధనలు, అన్నప్రసాదాల తయారీకి, లడ్డూ ప్రసాదాలకు అధికంగా వినియోగించే స్వచ్చమైనది నెయ్యి మాత్రమే. అన్న ప్రసాదాల నుంచి లడ్డూ ప్రసాదాల వరకు రుచికరంగా ఉండాలంటే స్వచ్చమైన నెయ్యి అవసరం. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య ప్రసాదాల తయారీకి పెద్దెత్తున కడాయిలల్లో నెయ్యి ఉంటుంది. ఆలయంలో ఏ ప్రసాదం చేయాలన్నానెయ్యి ఎంత అవసరం. టీటీడీ ప్రతి సంవత్సరం 5వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తుంది. అయితే మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది.

ఆన్ లైన్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కమిటీతో పాటు, టీటీడీ బోర్డ్ కమిటీ, ఆ తర్వాత పాలకమండలి తీర్మానం తర్వాత నెయ్యి కొనుగోలు ప్రక్రియ షురూ చేస్తుంది. నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన లేబొరేటరీని ఏర్పాటు చేసింది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుతుంది. ఈ మేరకు ప్రతి సంవత్సరం రెండు సార్లు టెండర్లు పిలుస్తోంది.

2021 మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి టీటీడీ కి సప్లై చేసింది. 2021 మార్చి లో జరిగిన టెండర్లలో L-3 గా నిలిచిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 20 లక్షల కేజీల నెయ్యిలో కేవలం 20 శాతం మాత్రమే L-1, L-2 అనుమతితో నెయ్యిని సప్లయి చేసింది. టెండర్ ప్రక్రియ లోనే పాల్గొనని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తక్కువ ధరకే నెయ్యిని సరఫరా చేయాల్సి వస్తుందని చెప్పింది.

లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యత అత్యంత కీలకం. దీంతో స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలుకు టీటీడీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో లడ్డూల తయారీకి పూర్వం వినియోగించే నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని డిసైడ్ అయ్యింది. కాగా టీటీడీ గతనెల మిల్క్ ఫెడరేషన్ తో సంప్రదింపులు జరిపింది. ఆ చర్చలు సఫలం అవ్వడంతో 2024-25కి కేజీ రూ. 470 చొప్పున టీటీడీకి 350 టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు టెండర్ ఖరారయ్యింది. రెండు ట్యాంకర్లలో 20వేల కేజీల నెయ్యిని మూడు రోజుల క్రిత్రం తిరుమలకు చేరింది.

ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యి నాణ్యతను పరీక్షించింది. నందిని నెయ్యి నమూనాలను పరీక్ష కోసం టీటీడీ ల్యాబ్‌కు పంపారు. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కోసం నందిని నెయ్యిని తీసుకువెళుతున్న ట్యాంకరుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం 2024-25 సంవత్సరానికి గాను తిరుమల ఆలయానికి 350 టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ ఖరారు అయ్యింది. నందిని ఉత్పత్తుల నుంచి తిరుమలకు కొన్నేళ్లుగా అగ్‌ మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ ఆవు నెయ్యిని సరఫరా చేస్తూనే ఉంది.

Tags:    

Similar News