Pawan Kalyan: మల్లవల్లి రైతులకు జనసేన అండగా ఉంటుంది
Pawan Kalyan: రైతులను కులాల వారీగా పార్టీలు చూడకూడదు
Pawan Kalyan: కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి రైతులకు అండగా ఉంటామని జనసేనాని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. 2016లో నాటి ప్రభుత్వం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడానికి 1460 ఎకరాలు భూమి తీసుకున్నారు. ఏడున్నర లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులమైన తమకు పరిహారం రాలేదంటూ పోరాటం చేస్తున్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులను పవన్ కలిశారు. రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రైతులను కులాల వారీగా పార్టీలు చూడకూడదన్నారు. రైతులకు బిజెపి, టిడిపి లు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.