Pawan Kalyan: రాష్ట్రం కోసం జైలుకెళ్లడానికి, దెబ్బలు తినడానికి సిద్ధం
Pawan Kalyan: కేసులకు భయపడేవాడిని అయితే పార్టీ ఎందుకు పెడతా..?
Pawan Kalyan: ఏపీ ప్రజల తరపున పోరాడేందుకు తాను వెనుకాడబోనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వాలంటీర్లపై మాట్లాడినందుకు నన్ను ప్రాసిక్యూట్ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న పవన్.. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులను పంపాలన్నారు. రాష్ట్రం కోసం జైలు కెళ్లడానికి, దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. కేసులకు భయపడే వాడినే అయితే పార్టీ ఎందుకు పెడతానన్నారు పవన్. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి చేరిన పంచకర్ల రమేశ్‌కు కండువా కప్పి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.