ఇసుక అక్రమ తవ్వకాలపై జనసేన ఆగ్రహం
*ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన జనసేన
Andhra News: గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలంటూ జనసేన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ భారీగా బలగాలు మోహరించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతంమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు వచ్చే వాహనాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు చలో అసెంబ్లీకి అనుమతి లేదంటున్నారు. జనసేన నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.