YSR Congress Party: వైసీపీకి రెడ్లు దూరమవుతున్నారా..?
YSR Congress Party: వైసీపీ ప్రభుత్వంపై రెడ్డి సామాజిక వర్గం గుర్రుగా ఉందా ?
YSR Congress Party: వైసీపీ ప్రభుత్వంపై రెడ్డి సామాజిక వర్గం గుర్రుగా ఉందా ? బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని బీసీలను, మైనార్టీలను దగ్గర తీయడమే కారణమా ? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా.?. ఓవైపు కమ్మ కమ్యూనిటీ టీడీపీకి వన్ సైడెడ్ గా సపోర్ట్ చేస్తుంటే, వైసీపీకి దగ్గరగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఇప్పడు దూరమవుతుందా ? రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి ఎందుకు దూరం అవుతున్నట్టు.? అధికార పార్టీ లో..సొంత సామాజికవర్గం బాధ ఏంటి ?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణాలు లెక్కలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. అగ్రవర్ణాలను పక్కన పెట్టి . నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని సీఎం జగన్ పదే పదే చెప్పటం వైసీపీ లో కొంత మంది రెడ్లకు నచ్చడంలేదు. జగన్ వన్ సైడ్ గా పనిచేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు పెద్ద రెడ్లతో మొదలైన పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇబ్బందిలోకి నెట్టేసింది. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు రెడ్లు ఒక్కసారిగా పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మంది రెడ్లు నెల్లూరు నుంచి మంత్రి పదవులు ఆశించారు. అనూహ్య రీతిలో సీఎం జగన్ సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లయిన మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు అవకాశం కల్పించారు. మొదటి ఫేస్ లో మంత్రి పదవి ఆశించిన కాకాని, కోటెంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. అయితే సెకండ్ ఫేస్ లో అవకాశం కల్పిస్తానని సీఎం హామీ ఇవ్వడంతో అందరూ కూల్ అయ్యారు.
ఆ తరువాత మేకపాటి గౌతమ్ మరణించడం అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రి వర్గం నుంచి తప్పించడంతో అసలైన రచ్చ అప్ఫడు మొదలయింది. మంత్రి పదవి వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నకోటెంరెడ్డి, ఆనంల ఆశలు ఆవిరయ్యాయి. కాకానికి మంత్రి పదవి ఇవ్వడం మిగిలిన రెడ్లు జీర్ణించుకోలేకపోయారు. ఇక వైసీపీ లో మంచి స్థానం దొరకదని భావించి టీడీపీకి టచ్ లోకి వెళ్లి సొంత పార్టీపై బురద జల్లడం స్టార్ట్ చేశారు.
మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన మరో నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నమేకపాటి పై నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. గడపగడపకు కార్యక్రమంతో పాటు, సీఎం జగన్ తెప్పించుకున్న రిపోర్ట్ ప్రకారం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై చాలా ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అతను వ్యవహరిస్తున్న తీరు పార్టీ ప్రతిష్టకు భంగంకలిగించేదిగా ఉండటంతో జగన్ మేకపాటిని పక్కన పెట్టారు. దీంతో ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
వైసీపీలో సీనియారిటీ ప్రకారం చూసుకుంటే చాలా మంది రెడ్లు మంత్రి పదవులకు అర్హులు. కానీ సామాజిక సమీకరణలతో కొంతమందికి మాత్రమే అవకాశం దక్కింది. ఇలా మంత్రి పదవులు ఆశించిన వారి లిస్ట్ చాలా ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, చంద్ర గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, కొత్త పేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఇలా చూసుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉంది. వీరందరికి మంత్రి పదవులు రాకపోయినా వైసీపీ లాయల్ గా ఉంటున్నారు. ఇలా నెల్లూరు రెడ్లు తెచ్చిన పంచాయతీ పార్టీకి నానా తంటాలు తెచ్చి పెట్టింది...ఇప్పుడు దీనిని సెట్ చేసే పనిలో ఉంది వైసీపీ అధిష్టానం.