Changes in AP Intermediate Syllabus: ఇంటర్ విద్యలో మార్పులు షురూ... ఆగష్టు 3 నుంచి తరగతులు?
Changes in Intermediate Syllabus: కరోనా వైరస్ విలయంలో అన్ని చోట్లా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Changes in Intermediate Syllabus: కరోనా వైరస్ విలయంలో అన్ని చోట్లా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పాటు విద్యా విధానంలో సైతం మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా ఏపీలో ఇంటర్ విద్యలో గత మాదిరి కాకుండా యూనిట్ టెస్ట్ లు నిర్వహించి, ఎప్పటికప్పుడు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇకపై ఇంటర్మీడియట్‌లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు రెడీ చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. సబ్జెక్టుకు ఒక వర్క్‌బుక్‌ను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా మల్టిపుల్ ఛాయిస్ క్వచ్చన్స్, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.
ఆగస్టు 3 నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్ క్యాలండర్-2021ను సిద్ధం చేసింది. కళాశాలల్లో ఉదయం సైన్సు, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. తమ పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలు వీటిని మార్పు చేసుకోవచ్చు. కళాశాలలు మొత్తం 196 రోజులు పని చేయనున్నాయి.
సీబీఎస్‌ఈ తరహాలో 30% పాఠ్యాంశాలు తగ్గిస్తారు.రెండో శనివారమూ పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటాయి. విద్యార్థులకు యూనిట్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలకు వీడియోలను రూపొందిస్తారు. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.