Laddu Controversy: కాసేపట్లో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

Laddu Controversy: వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్లపై విచారణ

Update: 2024-10-03 08:45 GMT

Laddu Controversy: కాసేపట్లో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై నాలుగు రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది.

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు ఆధారాల్లేకుండా ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. లడ్డూలో నెయ్యి కల్తీపై సిట్‌ను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అయితే.. సిట్ విచారణ జరిపితే ఏకపక్షంగా దర్యాప్తు సాగుతుందని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏ సంస్థతో విచారణ జరిపించాలన్నది ఇవాళ సుప్రీంకోర్టు తేల్చనుంది.

Tags:    

Similar News