ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Andhra Pradesh: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
Andhra Pradesh: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఓడిశా మీదుగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కరుస్తున్నాయి. నిన్న అనకాపల్లి జిల్లాలో 12.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రానున్న రెండు రోజులు ఏపిలో వర్షాలు కురిసే నేపధ్యంలో మత్స్యకారులకి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.