Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-07-16 04:40 GMT

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు

Rains:బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా ముసురు పెడుతోంది. సోమవారం అనకాపల్లి, క్రుష్ణా, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డా. బీఆర్ అంబేద్కర్, కోరసీమ, విశాఖ, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. ఎక్కువగా క్రుష్ణా జిల్లా క్రుతివెన్నులో 65.75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. విజయవాడలో రోజంతా వర్షం కురువడంతో రహదారులపై వరదనీరు చేరింది.

పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈనెల 19న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు, బుధవారం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లోకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడి ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేసింది. 

Tags:    

Similar News