Weather Report: ఏపి లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు..
Weather Report: పార్వతీపురం, కృష్ణ, NTR జిల్లాల తో పాటు కోస్తా జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్
Weather Report: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు కోస్తా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాగల 24 గంటల్లో సుమారు పశ్చిమ దిశగా, దక్షిణ ఒడిస్సా, దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదగా అల్పపీడనం కదిలే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.