Anantapur: అనంతపురం జిల్లా కల్లూరు రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్
Anantapur: రైల్వే ట్రాక్ మరమ్మతులు చేపట్టిన అధికారులు
Anantapur: అనంతపురం జిల్లా కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇందులో భాగంగా మూడు ఖాళీ గూడ్స్ వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీంతో సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని.. రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ మార్గంలో తిరిగే రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. గూడ్స్ వ్యాగన్లు పట్టాలు తప్పిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.