AP Govt: ఉద్యోగుల సమ్మె వేళ జగన్ ప్రభుత్వం తీపి కబురు..
AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగులకు డీఏ జీవో 66 ద్వారా, పెన్షనర్లకు జీవో 67 ద్వారా 2.73 శాతం డీఏను మంజూరు చేసింది. సవరించిన వేతనాలను ఉద్యోగులు జూన్ నుంచి అందుకోనున్నారు. ఇక కొత్త డీఏను జూలై 1 నుంచి జూన్ జీతంతో కలిపి ఇవ్వనున్నారు. అలాగే జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్ నెలల్లో 3 సమాన వాయిదాల్లో చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు తమ డిమాండ్ల సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యమానికి రెడీ అయింది. మే 5న తమ ఆందోళనకు సంబంధించిన నోటీసులను రాష్ట్ర సీఎస్ జవహార్ రెడ్డికి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. ఆ తర్వాత మే 22 నుంచి కార్యాచరణను ప్రారంభించి అక్టోబర్ 31 వరకు వివిధ దశల్లో ఉద్యోగులు ఆందోళన చేయనున్నారు. అక్టోబర్ 31న ఛలో విజయవాడకు పిలుపునిచ్చి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు.