ఉప్పూడిలో తగ్గని గ్యాస్ లీకేజీ తీవ్రత.. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ బ్లోవుట్ కంట్రోల్ టీం !
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో గ్యాస్ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. పెద్ద శబ్దాలతో ఎగిసి పడుతోంది. గ్యాస్ లీక్ కంట్రోల్ చేసేందుకు ఓఎన్జీసీ బ్లోవుట్ కంట్రోల్ టీం రంగంలోకి దిగింది. ముంబై నుంచి వచ్చిన బృందం ఘటనా స్థలం పరిశీలించి పలు సూచనలు చేసింది. గ్యాస్ బావి దగ్గర డిబ్రస్ రిమూవల్ చేస్తున్నారు. లీకవుతున్న వాల్వు గుర్తించే పని మొదలు పెట్టారు సాంకేతిక నిపుణులు.
వాటర్ అంబ్రిల్లా తో గ్యాస్ లీకేజి అదుపు చేసేందుకు ఓఎన్జీసీ, అగ్నిమాపక విపత్తుల నిర్వాహణ బృందాలు ప్రయాత్నాలు ఫలించకపోవడంతో ముంబై నుంచి సాంకేతిక నిపుణులను పిలిపించారు. ఓఎన్జీసీ బ్లోవుట్ టీమ్ గ్యాస్ కంట్రోల్ ఆపరేషన్స్ చేపడుతున్నారు. వాల్వు ద్వారా రసాయనాల ద్రవంతో కూడిన మడ్ పంపించేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రసాయనాలు పంపించే యంత్ర వాహననం ఘటనా స్థలికి చేరుకున్నది. వాటర్ పంపింగ్ కోసం రెండు భారీ పంపులు ఏర్పాటు చేశారు. ఏ విధంగా నియంత్రణ చేయాలో సూచనలు చేయనున్నారు. మూడు రోజులుగా కాట్రేని కోన మండలంలోని పలు గ్రామాలు అందకార మయం అయ్యాయి. గ్యాస్ బావి సమీపంలో పీఎఫ్ హెచ్ఎల్ ఆయిల్ సంస్థ ప్రతినిధులు ఆచూకీ లేకుండా పోయారు.