Kakinada: గడప గడపలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును నిలదీసిన మహిళలు

Kakinada: సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే చంటిబాబు

Update: 2023-08-05 11:43 GMT

Kakinada: గడప గడపలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును నిలదీసిన మహిళలు

Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. చంటిబాబును స్థానిక మహిళలు నిలదీశారు. ఎన్నిసార్లు అడిగినా తమకు కుళాయి కనెక్షన్‌ ఇవ్వలేదంటూ సూటిగా ప్రశ్నించారు. కుళాయి కనెక్షన్‌ ఇవ్వకపోతే ఓటేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే.. అక్కడినుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే చంటిబాబు.

Tags:    

Similar News