ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది : కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు

Update: 2020-06-01 10:55 GMT

రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఉల్లంగిస్తుందని విమర్శించారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. హైకోర్టు తీర్పులను కూడా ప్రభుత్వం గౌరవిస్తుందని నేను అనుకోవడంలేదని ఆయన అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కూడా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ లో తన పేరు కూడా ఉందని వెల్లడించారు. మూడు లాంతర్ల కూల్చి వేతకు .. కోటలో విషయాలు ముడి పెట్టడం సరికాదని, 1984 లో రాజ మహల్ ని తోలగించాం.1986-88 లో మోతీమహల్ రేనోవేషన్ చేసారు. అప్పటికి తన తండ్రి జీవించే ఉన్నారని చెప్పారు.

2014 ఆనంద గజపతి రాజు(సంచైత తండ్రి) శిధిలావస్థలో ఉన్న మోతీమహల్ ని ప్రభుత్వ అనుమతితో కూల్చి వేశారని చెప్పారు. ఎవరో సంచైత తీసుకోచ్చి మాన్సాస్ చైర్మన్ అన్నారు. ఆనంద గజపతి రాజు బ్రతికి ఉండగా.. సంచైత ఓక్కసారి వచ్చి కలిసిన దాఖలాలు లేవని గుర్తు చేసారు.

105 దేవాలయాల్లో ఏ ఓక్క పండగ లోనూ ఆమే పాల్గోన లేదు..ఇప్పుడు ఆమే తనపై కత్తి దూస్తున్నారని మండిపడ్డారు. తండ్రితో, తాతా తో ఏనాడూ లేని ఆమే ఈరోజు ఉద్దరిస్తానంటున్నారని విమర్శించారు. మాన్సాస్ ఆస్తులు కాజేయాలని ప్రస్తుత నేతలు చేస్తున్నారని ఆరోపించారు.

మల్లీ మాన్సాస్ ట్రస్ట్ లకు తానే చైర్మన్ అవుతాను .. కోర్టుల పై నమ్మకం ఉందన్నారు. సింహాచలం భూములను 30ఏళ్ల క్రితం రేట్లకి, తక్కువ రేట్లకు ఇప్పుడు ప్రైవేటీకరణ సరికాదని అన్నారు. మోతీ మహల్ కూల్చి వేత గురించి సంచైత తన తండ్రి ఆనంద్ గజపతిరాజు, తాత పివిజి రాజు ని ఆనాడే ప్రశ్నించి ఉంటే సరిపోయేదని చెప్పారు. సంచైత కుటుంబం వాడిన బాష కి దారుణంగా ఉందన్నారు.

Tags:    

Similar News