Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో ఆయన్ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో ఆయన్ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేసింది. అటు నందిగం సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే సురేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుంటూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ తాను లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో ఇక్కడికి చేరుకున్నారు. ఎట్టకేలకు సురేష్‌ను అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు.
కాగా మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్‌పై 2021 అక్టోబర్ 19న వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కంప్లయింట్ చేసింది. కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురిపై టీడీపీ నేతలు గతంలో ఫిర్యాదు చేశారు.