Fire Accident in Covid Care Center: విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం.. 6 గురు మృతి!

Fire Accident in Covid Care Center: ఈ తెల్లవారుజామున విజయవాడలో దారుణం చోటుచేసుకుంది.

Update: 2020-08-09 03:23 GMT
Fire Accident in Covid Care Center: విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం.. 6 గురు మృతి!
Fire Accident at Covid Care Center
  • whatsapp icon

Fire Accident in Covid Care Center: ఈ తెల్లవారుజామున విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఒక ప్రయివేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6 గురు కరోనా పేషెంట్లు చనిపోయినట్టు సమాచారం, విజయవాడకు చెందిన ఓ ప్రయివేట్ ఆసుపత్రి నగరంలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తోంది. ఇక్కడ దాదాపు 40 మంది పేషెంట్లు..10 మంది దాకా సిబ్బంది ఉన్నట్టు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. క్రింది అంతస్తుకు వ్యాపించాయి. దీంతో సెంటర్ లో ఉన్న పేషెంట్లు ఆందోళనతో పరుగులు తీశారు.

కొందరు భయంతో మొదటి అంతస్తు నుంచి దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయతే, బాధితులను తరలించడానికి అక్కడి మెట్ల మార్గం సరిపోలేదు. దీంతో వారిని నిచ్చెనల సహాయంతో మొదటి అంతస్తు నుంచి కిందకి చేర్చారు. ఈ క్రమంలో ఆరుగురు పేషెంట్లు చనిపోయినట్టు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News