Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. 11 మంది మృతి.. 15 మందికి తీవ్రగాయాలు
Rajasthan: భరత్‌పూర్ జిల్లా హంత్రా దగ్గర బస్సు-ట్రక్కు ఢీ
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్‌పూర్ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఓ బస్సును ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జైపూర్-ఆగ్రా నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని భావ్‌నగర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు బయల్దేరిన బస్సు.. బుధవారం తెల్లవారుజామున లఖ్నాపూర్ చేరుకుంది. అక్కడి ఆంత్రా ఫ్లైఓవర్‌పై హాల్టింగ్‌కు ఆగింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును గమనించని ట్రక్కు.. వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఇక.. ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు.