Gunturu: స్వాంతంత్య్ర వేడుకల్లో డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఆపరేటర్
గుంటూరు జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారా లోకేష్.
Gunturu: గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో డ్రోన్ కలకలం సృష్టించింది. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉన్నట్టుండి ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగిరింది. అయితే.. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నారా లోకేష్ పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలర్టయిన పోలీస్ యంత్రాంగం.. డ్రోన్‌ను సీజ్ చేసింది. డ్రోన్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీజ్ అయిన డ్రోన్ యూట్యూబర్ నందినికి చెందినదిగా తెలుస్తోంది.
గుంటూరు జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారా లోకేష్. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో గుంటూరు జిల్లా కీలకపాత్ర పోషించిందని ఆయన ఈసదర్భంగా అన్నారు. నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఇలాంటి నిబంధనలు, కోతలు ఉండవని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్నారు.