Tirupati: తిరుపతి చేరిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు

Tirupati: త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి డబుల్ డెక్కర్ బస్సు

Update: 2023-09-15 06:12 GMT

Tirupati: తిరుపతి చేరిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు 

Tirupati Double Decker Electric Buses: ఏపీలో మొదటిసారిగా తిరుపతి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అశోక్ లేలాండ్ అండ్ స్విచ్ కంపెనీ ఈ బస్సును తయారు చేసింది. ఈ బస్సును 2 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు దూరం ప్రయాణించేలా ఈ బస్సును తయారు చేశారు. డబుల్ డెక్కర్ బస్సులో 65 మంది ప్రయాణించేలా వెసులుబాటు కల్పించారు.

ప్రస్తుతం ఈ బస్సు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరింది. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బస్సులో సౌకర్యాలను పరిశీలించారు. వచ్చే మంగళవారం తిరుపతి పర్యటనకు రానున్న సీఎం జగన్ చేతులమీదుగా ఈ బస్సును ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News