Donkey Marriage: గాడిదలకు ఘనంగా పెళ్లి, ఊరంతా ఊరేగింపు.. ఎందుకో తెలుసా !
Donkeys Marriage: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో వర్షం కోసం గ్రామస్తులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
Donkeys Marriage: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో వర్షం కోసం గ్రామస్తులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. గాడిదలను ముస్తాబు చేసి.. వాటికి పెళ్లి చేసి.. టపాసులు పేల్చుతూ... గ్రామంలో ఊరేగించారు. రాష్ట్రంలో అధిక వర్షం కురుస్తూ చాలాచోట్ల వరదలు వస్తుంటే.. తామేం తప్పు చేశామో అర్థం కావడం లేదని, వర్షాకాలంలో కూడా చినుకు రాలక చేతికి వచ్చే పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆ గ్రామస్తులు... వానదేవుడు కరుణించి తమ ప్రాంతంలో వర్షం కురవాలని ఆకాంక్షించారు.
వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రకృతిని ఆరాధిస్తూ ఇలాంటి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తొందని అక్కడి వారు చెబుతున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.