Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
Tirumala: కంపార్టుమెంట్లు నిండి వెలుపల గోగర్భం డ్యాం వరకు క్యూ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలిపిరి చెక్‌పాయింట్‌లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ దాదాపు కిలోమీటరు మేరకు శిలాతోరణం వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 24 గంటల దర్శన సమయం పడుతోంది. స్లాటెడ్ దర్శన టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకూ దాదాపు మూడు గంటల దర్శన సమయం పడుతోంది.