Coronavirus in Annavaram: ఆగష్టు 23 వరకు దర్శనాలు నిలిపివేత: ఈవో త్రినాథరావు
Coronavirus in Annavaram: ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా 9వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Coronavirus in Annavaram: ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా 9వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల దేవస్థానం పనిచేసే 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయతే, మరోసారి స్వామి ఆలయంలో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కావడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో కుడా వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆగష్టు 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. సోమవారం 250 మంది సిబ్బందికి పరిక్షలు నిర్వహిచారు. నేడు మరోసారి కొత్తగా 50 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో త్రినాథరావు ప్రకటించారు.
ఇక బుధవారం రాష్ట్రంలోని కరోనా కేసులు చుస్తే.. గడిచిన 24 గంటల్లో ఏపీలో 9,597 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. ఇందులో 90,425 కేసులు యాక్టివ్ గా ఉంటె, 1,61,425 మంది కరోనాను జయించి, డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా 103 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2296కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా.. అనంతపూర్ లో 781, చిత్తూరులో 1,235, తూర్పు గోదావరిలో 1,332, గుంటూరులో 762, కడపలో 364, కృష్ణాలో 335, కర్నూలులో 781, నెల్లూరులో 723, ప్రకాశంలో 454, శ్రీకాకుళంలో 511, విశాఖపట్నంలో 797, విజయనగరంలో 593, పశ్చిమ గోదావరిలో 929 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు గోదావరి జిల్లా లో అత్యధికంగా 1,332 కేసులు నమోదుకావడంతో పాజిటివ్ కాసుల సంఖ్య 35,642 కు చేరింది.