ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్ర వ్యాప్తంగా 100 కొత్త కేసులు

Corona: కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష

Update: 2023-04-22 08:15 GMT

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్ర వ్యాప్తంగా 100 కొత్త కేసులు

Corona: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా కేసుల వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. కానీ కరోనా కు సంబంధించి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటీవల కరోనా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రభుత్వం చెబుతోంది. . ఏపీలోనూ కరోనా బారిన పడుతున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 100 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది...ఏపీలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 400 ఉన్నట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు..అయితే కరోనా బారిన పడినప్పటికీ సొంత వైద్యం తీసుకోవడం ,ఇంటివద్దనే హోమ్ ఐసోలేషన్ లో ఉండటంతో వాస్తవ పరిస్థితి బయటికి రావడం లేదని తెలుస్తుంది. కరోనా వ్యాపిస్తుందన్న సూచనలు నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

సీఎం జగన్ కరోనాపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనాకు గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం..బీపీ,షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ సోకితే వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని చెబుతుంది. విలేజ్‌ క్లినిక్స్‌ స్ధాయిలోనే ర్యాపిడ్‌ టెస్టులు చేసి... అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాట్టు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు వీటన్నింటినీ కూడా సిద్ధం చేస్తోంది సర్కార్.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైద్యశాఖ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం వైద్యశాఖను ఆదేశించింది. మందులు కోరత లేకుండా అన్ని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ లో కేర్ అండ్ లవ్ చిల్డ్రన్ వెల్ఫేర్ సొసైటీ ఎన్ జి వో హోం లో కోవిడ్ ప్రబలింది. ఈ మహమ్మారితో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు మరో 17 ఏళ్ల బాలికకు పరిస్థితి విషమంగా ఉండటంతో కే జీ హెచ్ ఐసోలేటెడ్ వార్డ్ కు తరలించారు. హోమ్ లో మొత్తం 17 మంది అనాధ పిల్లలు ఉండటంతో మిగతా పిల్లల ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు...ఇక ఇటీవల కాకినాడ జీజీహెచ్ లో కరోనాతో చేరిన ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టించింది. అయితే వారికి వేరే సమస్యలు ఉండటంతోనే మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వేరియెంట్ వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.కానీ గొంతు నొప్పి,జలుబు,జ్వరం అధికంగా ఉంటుందని చెనుతున్నారు.ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

Tags:    

Similar News