Central Jail: సెంట్రల్ జైలులో మత్తు పదార్థాల కలకలం.. ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు అరెస్ట్
Central Jail: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, గుట్కా సరఫరా
Central Jail: విశాఖ సెంట్రల్ జైలులో మత్తు పదార్థాల కలకలం రేగింది. గుట్టుచప్పుడు కాకుండా ఖైదీలకు గంజాయి, గుట్కా సరఫరా జరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు.. నిఘా ఉంచారు. ఓ వ్యక్తి బయటనుంచి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాలు బాల్స్‌గా చుట్టి గోడపై నుంచి విసురుతూ ఖైదీలకు గంజాయి సరఫరా జరుగుతుండటాన్ని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు.. నిందితుడిని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.