Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ
Tirumala: తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న శోభ
Tirumala: సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు దగ్గరుండి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శోభ శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి ఆమె తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలకు చేరుకున్న కేసీఆర్ సతీమణికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం ఆమెకు అన్ని రకాలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లారు.