Andhra Pradesh: ఈ నెల 22న కుప్పంలో ఏం జరుగనుంది?

*కుప్పంలో జగన్ పర్యటన నేపథ్యంలో టెన్షన్ టెన్షన్‌

Update: 2022-09-13 10:45 GMT
CM Jagan Visit Kuppam assembly constituency on September 22 | AP News Today

ప్రతిపక్షనేత బాబు ఇలాకా కుప్పంపై ఫోకస్ చేసిన సీఎం జగన్‌ రెడ్డి 

  • whatsapp icon

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఈ నెల 22న పర్యటించనుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో ఆయన్ని ఓడించేందుకు పావులు కదుపుతున్న వైసీపీ అధినేత-సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే తన పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కుప్పంలో ఇదివరకు వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగడం, తాజాగా సీఎం జగన్ పర్యటన ఫిక్స్ కావడంతో మున్ముందు ఏం జరుగనుందో అనే టెన్షన్ నెలకొంది. ఇంతకీ సీఎం జగన్ కుప్పం పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానం ఉంటుందా? ఇద్దరు నేతలు వేదిక పంచుకుంటారా? లేదా బాబు డుమ్మా కొడుతారా అనే పొలిటికల్ గుసగుసలు మొదలయ్యాయి.

Tags:    

Similar News