Andhra Pradesh: ఇకపై ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే నో ర్యాపిడ్
Andhra Pradesh: కరోనా అనుమానితులకు ర్యాపిట్ టెస్టులు వద్దని.. కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Andhra Pradesh: కరోనా కాస్త తగ్గినట్లు కనపడుతుండటంతో... దాని మానిటరింగ్ విషయంలో మార్పులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ర్యాపిడ్ టెస్టుల్లో సరైన ఫలితాలు రాక.. సీరియస్ అయి.. తర్వాత చనిపోయినవారు చాలామంది ఉన్నారు. ఆర్టీపీసీఆర్ లో మాత్రం సరైన ఫలితం వస్తుండటంతో.. దానినే ఎక్కువగా వాడాలని ఇప్పుడు నిర్ణయించారు. గతంలో సమయం లేక ర్యాపిడ్ టెస్టులు కూడా చేసేవారు. ఇప్పుడు మాత్రం ఇక నుంచి ర్యాపిడ్ టెస్టులు ఆపేసి.. కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నందున నేపథ్యంలో ఆసుపత్రులపై ఒత్తడి ఉండదన్న సీఎం... కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. దీనికోసం నియమించిన అధికారులు, ఆరోగ్య మిత్రలు ఆయా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సిబ్బంది పనితీరుతో పాటు నాణ్యమైన భోజనం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 322 ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందుతున్నాయి. 4,592 ఐసీయూ బెడ్స్‌లో 3,196 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 19,258 ఆక్సిజన్ బెడ్స్‌కు గానూ, 15,309 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రుల్లో ప్రమాణాలపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలన్న సీఎం.., ఆరోగ్యశ్రీ రోగులకు కచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల అధికారులను ఆదేశించారు.